నిబంధనలు తో దుల్హన్ పథకాన్ని నీరు కారుస్తున్న అధికార పార్టీ
జంటలకు50 వేలు ఆర్ధిక సాయం అందించిన నిజాం
పేదరికం లో ఉన్న వారికి సాయం చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్న నిజాం
పిట్టలవానిపాలెం జూన్ 11, (అఖండ భూమి) :
బాపట్ల జిల్లా
పిట్టలవానిపాలెం మండలంలో చందోలు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు కష్ట పడి జీవనం సాగిస్తూ ఉంటారు. రెక్కల కష్టం పై ఆధార పడి వారి కుటుంబాలు పోషించుకుంటు ఉంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయం లో అనేక పథకాలు మైనారిటీ లకు అండగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఆ పథకాలు అన్ని ప్రస్తుత ప్రభుత్వం నిబంధనలు అనే అంశాన్ని పెట్టి నీరు కారుస్తున్నాయి. పథకానికి చదువుకు ముడి పెట్టి దుల్హన్ పధకం పేదలకు అందని దారిద్రి పరిస్థితి లో ఉంది. అందరూ చదువుకోవాలి అంటే అది వారి కుటుంబ పరిస్థితులు బట్టి ఆధార పడి ఉంటుంది. ఈ కోవలో చందోలు గ్రామంలో ఆదివారం వివాహం చేసుకుంటున్న ఇద్దరు జంటలకు దుల్హన్ పధకం అమలు కానీ పరిస్థితిలో గ్రామ యువ తెలుగుదేశం నాయకుడు నిజాం అండగా నిలిచారు. తన వంతు సాయంగా ఇరువురు జంటలకు50 వేలు ఆర్ధిక సాయం చేసి అండగా నిలిచారు. ఈ ఆర్ధిక సాయం అందజేయటనికి బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వేగేసిన నరేంద్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.కార్యక్రమంను ఉద్దేశించి వేగేసిన నరేంద్ర మాట్లాడుతూ నిబంధనలు అనేవి ఏ పథకానికి లేకుండా ఉంటాయో అప్పుడే ప్రజలకు సంక్షేమం అందుతుంది అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన ప్రభుత్వాలలో తెలుగుదేశం ప్రభుత్వం అగ్రగామి గా నిలుస్తుంది అన్నారు.పార్టీ యొక్క సిద్ధాంతాలు, కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని పేదలకు నిజాం చేస్తున్న సేవలు మరువలేనివి అన్నారు. నేటి సమాజం లో ఫలితం ఆశించి పనిచేసే మనుషులు ఉన్న పరిస్థితిలో ఏమి ఆశించకుండా సేవ చేయటం అభినందనీయం అన్నారు. గతంలో సుమారు వందల మందికి తోఫా అందించి పేదల ఆకలి రంజాన్ మాసంలో తీర్చాడు నిజాం అని అన్నారు. తెలుగుదేశం పార్ట్ పేదల అభ్యున్నతి కి మాత్రమే ఏర్పడింది అని ప్రజలకు తెలియజేసారు. కష్టం ఎవరికి ఉన్న తమకు తెలిస్తే సాధ్యం ఐనంతవారకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.చందోలు యువ నాయకుడు నిజాం మాట్లాడుతూ పేదలకు ఏదో చేయాలి అని సంకల్పం తన తండ్రి నుండి తీసుకొని తన కుటుంబీకుల సహకారం తో చేస్తున్నానని అన్నారు.తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నచ్చి వేగేసిన చేసే సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీరా, సైదా, అన్వర్,ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.



