Jammu Kashmir: సరిహద్దు దాటేందుకు యత్నించిన ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ..
జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది..
ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.
ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇద్దరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఉగ్రవాదులిద్దర్ని కాల్చి చంపేశాయి. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను ఎల్ఓసీ వద్ద ఆర్మీ, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో హతమార్చినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. గత నెలలో శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మిట్ ను భగ్నం చేసేందుకు ఇలాగే పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేసింది.
You may also like
-
రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
-
ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
-
ఆ పార్టీలను భూస్థాపితం చేయాలి: రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్
-
రైతు సమస్యల పరిష్కార వేదికగా రీ సర్వే గ్రామసభ.
-
రావణా పల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం