కాకినాడ జిల్లా పెద పూడి మండలం రామేశ్వరం, కరప టౌన్ లలో రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్ పర్యటించారు. ఎస్సీల వర్గీకరణ వలన జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేను పర్యటించిన గ్రామాలలో మాలల బ్రతుకులలో ఊహించిన మార్పు రాలేదని, ఉన్న రిజర్వేషన్ లు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. ఇలా ఉండగా ఆ రిజర్వేషన్ లనే వర్గీకరణ పేరుతో మాయ చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. మాలలపై అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. మాలలకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికే అన్ని రాజకీయ పార్టీలను భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ కొన్ని నెలలుగా దాదాపు 200లకు పైగా గ్రామాలలో పర్యటించి ఎస్సీ ల కుట్ర పూరిత వర్గీకరణ వ్యతిరేక గర్జన (రాక్స్) ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాలల అణచివేతకు రాజకీయ కుట్ర మొదలైందని దాన్ని ఎదుర్కొంటామని రత్నాకర్ అన్నారు. మాలల జోలికి వస్తే ప్రభుత్వాలు కూలడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాక్స్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.