రైతు సమస్యల పరిష్కార వేదికగా రీ సర్వే గ్రామసభ.

తహశీల్ధారు రమేష్ బాబు.

యస్ రాయవరం.. అఖండ భూమి.న్యూస్ ..అక్టోబర్ 25……
రీ సర్వే గ్రామాలలోని రైతుల సమస్యల పరిష్కార వేదికగా రీ సర్వే గ్రామసభలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తహశీల్ధారు జె. రమేష్ బాబు అన్నారు. శుక్రవారం ఉదయం మేజరు పంచాయితీ తిమ్మాపురం పంచాయితీ ఆవరణలో ఏర్పాటు చేసిన రీ సర్వే గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2023 వ సంవత్సరంగా ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందన్నారు. వారిచ్చిన తగు మాత్రం సమయంలో రీ సర్వే చేసిన సమయంలో రైతులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూపకపోవడం, కుటుంబ సమస్యల కారణం వంటి అంశాల మూలంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయన్నారు. అటువంటి పొరపాట్లను సరిదిద్ది పరిపూర్ణమైన రికార్డుల తయారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు తమ వద్ద నున్న రికార్డులను గ్రామసభ ధరఖాస్తులో పొందుపరచిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గతంలో జరిగిన రీసర్వేలో గ్రామంలో భూహక్కు పత్రాలు ఎన్నికల కారణంగా ఇవ్వలేకపోయామన్నారు. ప్రభుత్వం భూసర్వే పత్రాలలో మార్పులు చేపట్టినందున వాటిని రాగానే అందిస్తామన్నారు.అంతకు ముందు మండల సర్వేయర్ మూర్తి మాట్లాడుతూ గ్రామసభలో ఏయే సమస్యలు పరిష్కారమవుతాయో రైతులకు వివరించారు. సర్పంచ్ కర్రి సత్యన్నారాయణ మాట్లాడుతూ రీ సర్వే కారణంగా రైతాంగ భూములకు పూర్తి క్లారిటీ వచ్చిందని, రీసర్వే రికార్డులను పంచాయితీ కార్యాలయాలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిటిఈ నీరజ, సర్వేయర్ మూర్తి వీఆర్వో నూకరాజు, గ్రామ నాయకులు రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!