అతిసార నియంత్రణ పక్షోత్సవాలు ముగింపు” పురస్కరించుకొని అవగాహన ర్యాలీ
ఎస్.రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద “అతిసార నియంత్రణ పక్షోత్సవాలు” ముగింపు సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయుష్ విభాగం మెడికల్ ఆఫీసర్ డాక్టర్.అర్.సుజాత మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా నెత్తిపై టోపీ ధరించాలని బయటి తప్పనిసరి అయితే తప్ప వెళ్ళకూడదని తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే గొడుగు తీసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అలాగే మలేరియా ఇంఛార్జి నోడల్ అధికారి పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ బయట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ కు గురవుతారని దాని కొరకు ఓ. ఆర్. ఎస్ ద్రావణాన్ని తయారుచేసుకొని కొంచెం కొంచెం గా తాగుతూ ఉంటే శరీరం నుండి కోల్పోయిన నీరు మరియు లవణాలు రీ హైడ్రేట్ అవటం మూలంగా వడదెబ్బ నుండి త్వరగా కోలుకుంటారని అలాగే లేత కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ తదితర మీకు అందుబాటులో ఉన్న ద్రావణాలు త్రాగుట వలన రీ హైడ్రేట్ అవుతారని అలాగే వయసుతో నిమిత్తం లేకుండా విరోచనాలు బారిన పడిన పిల్లలు,యువకులు ,వృద్దులు ఎవరైనా ఈ ఓ.అర్.ఎస్ ద్రావణాన్ని తయారుచేసుకొని కొంచెం కొంచెం గా త్రాగుతూ వుంటే దీనితో పిల్లలకు జింక్ టానిక్ లేక టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే విరోచనాలు త్వరగా కంట్రోల్ అవుతాయని ఈ ఓ.అర్.ఎస్.ప్యాకెట్లు ఆశా కార్యకర్త వద్ద , హెల్త్ సెక్రెటరీ వద్ద , హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ వద్ద , పి.హెచ్.సి వద్ద అందుబాటులో వుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక సచివాలయం హెల్త్ సెక్రెటరీ ఎన్.రాజేశ్వరి, స్టాఫ్ నర్స్.వెంకట్, ల్యాబ్ టెక్నీషియన్ ఇందల హరి, ఎఫ్.ఎన్.ఒ.హారిక ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..