రాష్ట్ర ప్రభుత్వ ఆశయ సాధనకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు.

రాష్ట్ర ప్రభుత్వ ఆశయ సాధనకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు.

కళింగ వైశ్య స్టేట్ డైరెక్టర్, కళింగ వైష్య సంఘాన్ని అభినందించిన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు.

పార్వతీపురం, జూన్ 18 (అఖండ భూమి ) :పార్వతీపురం పురపాలక సంఘం కళింగ వైశ్య సంఘం సభ్యులు మరియు స్టేట్ డైరెక్టర్ మెహర్ ప్రసాద్ సంయుక్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలులో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పెద్దలతో కలిసి నిరుపేద కళింగ వైశ్య కుటుంబానికి రూ. 1,06,000 ఆర్థిక సహాయం మరియు 32 మంది పట్టణ నిరాశ్రయులకు మంచాలు, వస్త్రాలు పంపిణీచేసారు.పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల పార్వతీపురం పురపాలక సంఘంలో ఆదివారం నాడు శ్రీశ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో పార్వతీపురం పట్టణ కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొనడం జరిగినది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వైకాపా సీనియర్ నాయకులు కలింగవైశ్య స్టేట్ డైరెక్టర్ మెహర్ ప్రసాద్ తనకు రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న జీతంతో పాటు తన సొంత డబ్బులను కొంత మొత్తంలో వెచ్చించి బెలగం ప్రాంతం రైతు బజారుకు ఎదురుగా గల నిరాశ్రయులు వసతి గృహంలో తల దాచుకున్నటువంటి నిర్భాగ్యులకు 32 మందికి కుషాన్ మడత మంచాలు, 64 దుప్పట్లు, 32 దిండ్లు, బెడ్ షీట్లు, గలేబీలను సమకూర్చి పంపిణీ చేయడం కొరకు ఉంచడంతో పాటుగా కళింగ వైశ్య సంఘం సభ్యులందరూ కలిసి వారి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబానికి 1,06,000 వేల రూపాయలు ఆర్థిక సహాయంను సహితం ఈ కార్యక్రమంలో అందజేయడం జరిగింది.కార్యక్రమంలో ముందుగా స్టేట్ డైరెక్టర్ మెహర్ ప్రసాద్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే జోగారావు ని ఆదర్శంగా తీసుకొని ఈ సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం జరు

Akhand Bhoomi News

error: Content is protected !!