అగ్నిభాదితరాలును పరామర్శించిన వరుపుల సత్యప్రభ…. 5 వేలు వ్యక్తి గత సాయం.

శంఖవరం :(అఖండ భూమి) మండలంలో గల అన్నవరం గ్రామంలో డిగ్రీకాలేజీ సమీపంలో గల లేఅవుట్ సైట్ లో కోళ్ల అప్పలనర్స (పాప) చెందిన నివాసపు పూరి పాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు పూర్తిగా దగ్ధం అయిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జి వరుపుల సత్యప్రభరాజా ఆదివారం సందర్శించి అగ్నిప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు దగ్ధంతో పూర్తిగా నిరాశ్రయులైనట్లు బాధితురాలు కన్నీటిపర్య0తమవ్వగా ఆమెను సత్యప్రభ ఓదార్చారు. వరుపుల సత్యప్రభ వ్యక్తిగత సాయంగా 5 వేలు బాధితురాలికి అందిస్తూ ప్రభుత్వపరంగా ఉచిత ఇల్లు, ఇతర సహాయం అందించడంలో అధికారులు జాప్యంలేకుండా బాధితురాలికి చూడాలని కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని బాధితులకు ఆమె హామీ ఇచ్చారు. సత్యప్రభ వెంట వెన్నా ఈశ్వరుడు, బద్ది రామారావు,
కొమ్ముల తిరుమల కుమార్, యాళ్ళ జగదీశ్, ఉల్లి వీరభద్రరావు,
కీర్తి వెంకట సుభాష్, జువ్విన తిరుపతి రావు,
ప్రగడ మహేష్ తదితరులున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


