తక్షణమే పునర్వాసం ఇవ్వండి….

 

సోలార్ పరిశ్రమలో భూములు కోల్పోయి ఎనిమిది సంవత్సరాలు అయినా పునరావాసం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్న బాధిత రైతులు.

తక్షణమే పునర్వాసం ఇవ్వండి.

ఓర్వకల్లు రూరల్ అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఓర్వకల్లు తాసిల్దార్ కార్యాలయం ముందు బాధిత రైతుల ధర్నా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు ఆలస్యం చేయడం తగదు భూ నిర్వాసితుల కమటి ఈరోజు సోలార్ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులకు హైకోర్టు ఆదేశాల మేరకు పునరావాసం కల్పించాలని ఓర్వకల్ తాసిల్దార్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై భూములు కోల్పోయిన రైతులందరికీ తక్షణమే పునరావాసం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న సిఐటియు మండల అధ్యక్షులు జి.శ్రీధర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న లు మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ కొరకు 2015లో భూములు రైతుల నుండి తీసుకున్నారని ఎనిమిది సంవత్సరాల కాలమైనా ఇంతవరకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విఫలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ఆదేశాలను అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేసి రైతుల అన్యాయం చేస్తున్నారని విమర్శించారు ఒకపక్క భూములు పోయి పనులు లేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని అటువంటి రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు పునరావాసం కోసం జిల్లా లోకదళత్ కోర్టులో 2019 లో కేసు వేశారని అప్పటినుండి జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీవో తాసిల్దారు గారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు రైతుల పట్ల సానుకూలంగా స్పందించి రైతులకు అనుకూలంగా నివేదికలు పంపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో రైతులు దశలవారీగా ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చాంద్ బాషా, సిఐటియు నాయకులు సుధాకర్, రైతులు మల్లమ్మ, లక్ష్మీదేవి, మనోహర్, అన్న నాగన్న, భూష, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!