- బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ తొగరు మూర్తి.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్ జంక్షన్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఈ రోజు ఉదయం పది గంటలకు తూర్పుగోదావరి జిల్లా బ్లడ్ డోనార్స్ క్లబ్ అధ్యక్షులు తొగరు మూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన గమంత్రా ప్రెసిడెంట్ షేక్ తాజుద్దీన్ వారి కమిటీ ని అభినందించారు. రోజురోజుకు ఎండ తీవ్రతం ఎక్కువ అవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.షేక్ తాజుద్దీన్, మామిడాల వెంకటేశులు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ థెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చల్లటి మంచినీరు మజ్జిగ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ,జాయింట్ సెక్రెటరీ వీర వెంకట చౌదరి, వాలంటీర్స్ మణిదీప్ భార్గవ్ సాయి రెడ్డి కార్తీక్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ధ.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


