26న లోదొడ్డిలో గడపగడపకు మన ప్రభుత్వం
రాజవొమ్మంగి, అఖండ భూమి జూన్ 23 మండలంలోని లో దొడ్డి గ్రామంలో ఈనెల 26న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పంచాయతీలోని అన్ని గ్రామాలులో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించడం జరుగు తుందన్నారు. లోదొడ్డిలో ఏడాది క్రితం కల్తీకల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందడం జరిగింది. తొలుతగా ఒక్కొక్క బాధ్యత కుటుంబానికి 3లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం నిధి నుండి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు చెక్కులు అందించడం జరుగుతు ందన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జె సి ఎస్ మండల ఇంచార్జి, వాలంటీర్లు, గృహసారథులు, పత్రికా సోదరులు హాజరు కావలసిందిగా రామకృష్ణ కోరారు.



