సామాజిక తనిఖీ నిర్వహించిన అధికారులు…

 

సామాజిక తనిఖీ నిర్వహించిన అధికారులు…
వెల్దుర్తి జూన్ 24 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు సామాజిక తనిఖీ జిల్లా అధికారులచే నిర్వహించారు. ఈ సామాజిక తనిఖీలో భాగంగా 2022 నుండి 23 వరకు సంవత్సర కాల పరిమితిలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ₹ .15 కోట్ల 79 లక్షలు ఉపాధి పనులు జరిగాయి. ఇందులో అవినీతికి పాల్పడిన రికవరీ అమౌంట్ ₹. 31, 845/- లు, ఈ పనులలో పెనాల్టీ రుసుము ₹. 45, 590/- లు, వెరిఫికేషన్ రుసుము సరిదిద్దుకోవడానికి 15 రోజులలో ₹. 1.58,871/- లకు అవకాశం కల్పించారు. ఈ ప్రజా వేదిక నందు ఎటువంటి అవకతవకలు జరగకపోవడంతో అధికారులు సజావుగా ప్రజావేదికను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డ్వామా పీడీబీ అమర్నాథ్ రెడ్డి, డి డివిఒ సిద్ధ లింగమూర్తి, అమూస్ పర్సన్ సురేష్ , తిరుమలగిరి, వెల్దుర్తి మండల జడ్పిటిసి దాదిపోగు సుంకన్న, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శైలజ, ఏపిడి సలీం బాషా, ఎంపీడీవో శ్రీనివాసులు ఏపీవో రాజు నాయక్, ఎస్ఆర్పిలు మల్లికార్జున తిరుమలేష్, డిఆర్పీలు సీనియర్ మేటీలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!