పలమనేరు సాయిరాం హాస్పిటల్ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డు వితరణ
పలమనేరు జూన్ 24 ఆఖండ భూమి వెబ్ న్యూస్:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో ఉన్న సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో పార్కింగ్ సమస్య దృష్ట్యా 19 నో పార్కింగ్ బోర్డులు హాస్పిటల్ యాజమాన్యం వైద్యులు యుగంధర్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ కు పార్కింగ్ బోర్డులను సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది పట్టణంలో ప్రధాన వీధులైన, జవిలి వీధి బజారు విధులు నందు నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండడాన్ని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ తన దృష్టికి తీసుకురావడంతో వన్ సైడ్ పార్కింగ్ బోర్డులు తానే సొంతంగా తయారు చేయించి ప్రజల సౌకర్యార్థం వితరణగా స్టేషన్కు అందజేశామన్నారు ,సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ సాయిరాం మల్టీ స్పెషాలిటీ వైద్యులు యుగంధర్ సహకారంతో వన్ సైడ్ పార్కింగ్ బోర్డులను వితరణగా అందజేశారని ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీగా ఉందో అలాంటి చోట వీటిని ఏర్పాటు చేసి వాహనదారులకు, పాధాచారులకు వెళ్లేందుకు సౌకర్యంగా కల్పిస్తామని తెలిపారు నో పార్కింగ్ బోర్డులు అందజేసిన వైద్యులు యుగంధరకు అభినందనలు తెలిపారు



