వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దౌర్జన్యాలు దోపిడీలు అధికమయ్యాయని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆరోపించారు మంగళవారం నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనసైనికులతో కలిసి సూర్యచంద్ర గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం గ్రామంలో పర్యటించారు గ్రామస్ధులు పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామంలో కొండపై ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ఒక్క ఇల్లు కూడా కట్టని పరిస్థితి ఉందన్నారు ఎస్సీ కాలనీ ఎటువంటి అభివృద్ధి కీ నోచుకోలేదన్నారు ఇంటింటికి కుళాయిలు పేరుతో రోడ్లను తవ్వేసి వదిలేశారు తప్పా నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు శ్మశానాలు అడవులను తలపించే విధంగా ఉన్నాయన్నారు వైసిపి నాయకులు అంగన్వాడీ పోస్టులను అడ్డగోలుగా అమ్మేసు కుంటున్నారని ఆరోపించారు జగనన్న కాలనీలకు కేటాయించిన ఎస్సీల భూములను స్థానిక వైసీపీ నాయకుడు అడ్డగోలుగా అన్యాయంగా దోపిడీ చేశారని ఎద్దేవా చేశారు ఎస్సీల దగ్గర నుంచి తక్కువ ధరకు భూములు కొట్టేశారన్నారు ఎస్సీ కాలనీలో దశాబ్దాల క్రితం నుంచి నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎస్సీ ఫీజు రీయింబర్స్మెంట్ రాక రేషన్ కార్డులు లేక పెన్షన్లు తీసివేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు పంచాయతీ నిధులను అడ్డగోలుగా దోపిడీ చేస్తూ కనీసం సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు ఒక వైసిపి నాయకుడి హయాంలో గ్రామంలో అక్రమ కలప వ్యాపారానికి అడ్డాగా మారిందన్నారు సచివాలయ సిబ్బంది లంచాలకు మరిగి ప్రభుత్వ పథకాల కోసం వచ్చే వారి కాళ్లు అరిగేలా సచివాలయంచుట్టూ తిప్పుకుంటున్నారన్నారు కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో నాయకులు ఉన్నారన్నారు అలాగే గ్రామంలో నాటు సారా ఏరులై పారుతుందన్నారు వైసీపీ నాయకులు అడ్డగోలుగా గ్రావెల్ ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారని తెలిపారు వైసిపి నాయకులకు దమ్ముంటే గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బంగారు నాయుడు గుడివాడ సత్తిబాబు నెల్లి మణికంఠ చిటికెల హరినాద్ చిటికెల రవి మామిడి నూకరాజు సుర్ల వేమేష్ చిటికెల నానాజీ అంకంరెడ్డి అమేష్ తదితర జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


