నాతవరం మండలంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో ఈ రోజు మండల సర్వసభ్య సమావేశం జరిగింది అనంతరం కార్యాలయం ఎదుట లింగంపేట గ్రామ సర్పంచ్ రాము మరియు అదే గ్రామానికి చెందిన వైసిపి నేత దేవాడ శ్రీను మధ్య కొట్లాట జరిగింది ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్నారు అంగన్వాడి పోస్ట్ అమ్ముకున్నారని ఒకరు వేరొకటి అమ్ముకుని డబ్బులు తీసుకున్నారని మరొకరు ఆరోపించుకుంటూ ఘర్షణకు దిగి కొట్టుకున్నారు వీరిద్దరూ ఒకే పార్టీకి చెందడం విశేషం దీనిపై స్థానిక బిజెపి నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ పోస్టులు బహిరంగంగా అమ్ముకోవడం అనేది సిగ్గుచేటని దారుణమని ఆయన అన్నారు వైసీపీ నాయకులు అంగన్వాడీ పోస్టులను అమ్ముకునే పథకాలు అభివృద్ధి చేస్తూ ప్రజలను మోసం చేస్తూ వైసీపీ నేతలు డబ్బు చేసుకుంటున్నారని ఆయన అన్నారు ఈ విషయంపై పలువురు జనసేనపార్టీ తెలుగుదేశంపార్టీ నాయకులు స్పందించారు ప్రభుత్వ యంత్రాంగం విచారణ చేసి అంగన్వాడీ పోస్టులు విక్రయం పై నిజ నిర్ధారణ చేయాలని అంగన్వాడీ పోస్టులు విక్రయిస్తూ అవినీతికి పాల్పడిన అధికారులు నాయకుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

