సినీ డైరెక్టర్లను సన్మానించిన హెల్పింగ్ అండ్ సొసైటీ సంస్థ….
వెల్దుర్తి జులై 07 అఖండ భూమి వెబ్ న్యూస్ :
తెలుగు జాతి గర్వపడే మంచి కథనంతో సినిమా తీసిన బలగం సినిమా డైరెక్టర్ నటుడు వేణుని మరియు తెలుగుజాతి గర్వించదగ్గ మహోన్నత రచయిత అనేక సినిమాలకు స్క్రిప్టు రైటర్ గా మాటల రచయితలుగా ఉన్న పెద్దింటి అశోక్ కుమార్ మరియు బలగం కథా రచయిత నాగరాజు తదితరులు శుక్రవారం వెల్దుర్తి గ్రామానికి రావడం బ్రహ్మగుండ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. వారిని హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది ..ఈ కార్యక్రమంలో పాండురంగ స్వామి పీఠాధిపతి ఎల్లప్ప స్వామి, వైద్యం గిడ్డయ్య సాహితీ పురస్కార కమిటీ అధ్యక్షులు వైద్యం రామానాయుడు, హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు హరిసింహనాయుడు, సింగర్ సురేష్ నాయుడు, అంజి శెట్టి ,లక్ష్మీనారాయణ, దేవ సింహ నాయుడు, అఖిల్, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు



