దళితులకు పెద్దపీట వేస్తున్న దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు..
ఆరుగుల మోషే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు.
కోటనందూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి దళితులకు పెద్దపీట వేస్తున్నారని కోటనందూరు మండలం, భీమవరం కోట గ్రామానికి చెందిన రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆరుగుల మోసే అన్నారు. తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో సర్పంచ్ లంక వెంకట లక్ష్మి అధ్యక్షతన దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలు జరిగినవి. వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోషే మాట్లాడుతూ అణగారిన వర్గాలు, పేదలు,దళితులు ఉన్నత చదువులు చదువుతున్నారంటే దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం అని, ఎందరో దళితులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని అన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులతో లోవకొత్తూరు గ్రామానికి చెందిన సర్పంచ్ లంక వెంకటలక్ష్మి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన నిరుపేద మహిళ బూర్తి సింహాచలం కు 25 కేజీల బియ్యం, కిరాణా, కూరగాయలు సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దూలపల్లి నాగేశ్వరరావు ,మొయ్యేటి ఏసు, దళిత నాయకులు ప్రేమ కుమార్,బద్దా లోవ రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.