జగనన్న సురక్ష పేదలకు లబ్ది…

 

జగనన్న సురక్ష పేదలకు లబ్ది

జెడ్పీటీసీ వడుగుల జ్యోతి

అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి అఖండ భూమి రాజవొమ్మంగి మండలంలోని వాతంగి పంచాయతీ కార్యాలయం పరిధిలో బుధవారం నిర్వహించారు, ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ వడుగుల జ్వోతి,వైసిపి మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ,మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు కొంగర మురళికృష్ణ వైస్ ఎంపిపి జుర్రా రాజేశ్వరీ,స్థానిక సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా సర్టిఫికేట్స్ కొరకు దరఖాస్తులు పెట్టుకొన్న లబ్ధి దారులకు సర్టిఫికేట్స్ అందజేశారు ఈసందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సురక్ష పథకం ద్వారా ఉచితంగా 11 రకాల సేవలతో సర్టిఫికెట్లు పొందుతున్నారని తెలిపారు, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి జగనన్న సురక్షా పధకం ద్వారా ఈసేవలు అందచేయడంలో అధికారులు,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో మంచి స్పందన వస్తుందని అన్నారు,ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,వార్డు మెంబర్స్,సచివాలయం సిబ్బంది,వాలంట్రీలు,లబ్ధి దారులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!