భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.
-39.10 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి(జూలై 20,అఖండ భూమి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం వద్ద గోదావరి క్రమ, క్రమంగా గంట, గంటకు వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం గురువారం ఉదయం 7 గంటలకు 39.10 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం,నేటి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ వరద అందితే మరింత పెరిగే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలు జలమయం కానున్నాయి. ఈ నేపథంలో వాగులు,వంకలు పిల్లకాలువలు ఉరకలేస్తున్నాయి. మూడో రోజు కూడా కొనసాగుతున్న వర్షం.నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, గోదావరికి ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టులు నుండి వస్తున్న వరద వల్ల భద్రాచలం 43 అడుగులు మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, గురువారం ఉదయం 7 గంటలకు 39.10 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ డా” ప్రియాంక అలా తెలిపారు. దిగువకు 7 లక్షల 66 వేల 842 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ యంత్రాంగపు సూచనలు, సలహాలు పాటించాలని ప్రజలకు సూచించారు. ముంపుకు గురయ్యే వరకు వేచి ఉండకుండా ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేయాలని, రాకపోకలు నియంత్రణకు పటిష్ట బారికేడింగ్, ప్రమాదహెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముంపు ప్రాంత ప్రజల రక్షణపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలనారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దనారు. పశువులను ఆరుబయట మేతకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచాలని, రక్షణకు ఎతైన ప్రాంతంలో ఉంచాలన్నారు. ప్రజలు ఇంటి నుండి బయటకు రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలన్నారు అత్యసవర సేవలకు కొరకు కలెక్టర్ కార్యాలయంలో 08744-241950, వాట్సాప్ నెంబర్ 9392919743, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో 08743-232444, వాట్సప్ నెంబర్ 7981219425 ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము నెంబర్లు 24 గంటలు పనిచేస్తాయని ఫోన్ చేసి కానీ, వాట్సాప్ నెంబర్లుకు మెసేజ్, వీడియో ద్వారా కానీ సమస్యను తెలియజేయాలన్నారు.



