రాజకీయాలు వేరు ప్రజా… సంబంధాలు వేరు…గోపాల్ రెడ్డిని పరామర్శించిన శశిధర్ రెడ్డి..
అఖండభూమి. సూర్యాపేట జిల్లా. కోదాద్రూరల్ :
రాజకీయాలలో అంకితభావంతో పనిచేస్తూ, సోదర భావంతో మెలగాలని, రాజకీయాలను, ప్రజా సంబంధాలను ఒక తాటిపై కట్టరాదని భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం శాంతినగర్ గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ సీనియర్ నాయకుడు గునుకుల గోపాల్ రెడ్డి కి హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసి, భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి పరామర్శించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలు, ప్రజా సంబంధాలు వేరువేరు అని ఈ రెండిటిని కలిపి చూడకూడదని అన్నారు. నాటినుండి నేటి వరకు రాజకీయాల్లో నమ్ముకున్న పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ, తోటి రాజకీయ నాయకులతో సోదర భావంతో ఉండడమే నిజమైన రాజకీయు నాయకుని లక్షణమని అన్నారు. పరామర్శించిన వారిలో అనంతగిరి జడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరు జడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు శాంతినగర్ గ్రామ సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు కాకమారి నారాయణరెడ్డి కొత్త వెంకటరెడ్డి మారగాని వెంకన్న కర్త రమేష్ అనంతగిరి పిఎసిఎస్ డైరెక్టర్ హర్షదాసు వార్డ్ మెంబర్ కరుషరాజు కరిష పిచ్చయ్య తదితరులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



