ఎమ్మెల్యే సీతక్కకు వినతి పత్రం సమర్పించిన గ్రామ పంచాయతీ సిబ్బంది.
ఏటూర్ నాగారం, అఖండ భూమి ప్రతినిధి, జులై 23.
ములుగు నియోజక వర్గం ఎమ్మెల్యే సీతక్క కి గ్రామపంచాయతీ సిబ్బంది వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏటూరునాగారం మండలం 12 గ్రామ పంచాయతీ ల సిబ్బంది జేఏసీ మండల అధ్యక్షులు ఇరుసవడ్ల రాజు ఆధ్వర్యం లో 18 రోజులు నుంచి సమ్మె చేస్తున్న కూడ ప్రభుత్వం తమ డిమాండ్స్ ని పరిష్కారం చెయ్యడం లేదని తమ డిమాండ్లని ప్రభుత్వానికి వినిపించాలని 51 జి ఓ రద్దు చేసి కారోబార్, బిల్ కలెక్టర్ లకి అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులు గా హోదా ఇవ్వాలని, సిబ్బంది కి 60 జి ఓ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి తమ ఎమ్మెల్యే ద్వారా వినిపించాలని కోరడమైనదని తెలిపారు.ఇట్టి కార్యక్రమం లో జిల్లా జేఏసీ నాయకుడు సర్వ వెంకన్న , లక్ష్మి నారాయణ, వలస సత్యం, వెంకటేశ్వర్లు, రాంబాబు, భూ లక్ష్మి, సమ్మక్క, రజిత, సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…



