పి ఆర్ టి యు టిఎస్ సభ్యత్వ నమోదు వారోత్సవాలను విజయవంతం చేయండి: పింగిలి శ్రీపాల్ రెడ్డి. 

 

పి ఆర్ టి యు టిఎస్ సభ్యత్వ నమోదు వారోత్సవాలను విజయవంతం చేయండి: పింగిలి శ్రీపాల్ రెడ్డి.

ములుగు, అఖండ భూమి న్యూస్ ప్రతినిధి, జూలై 23.

పిఆర్టియు టిఎస్ సభ్యత్వ నమోదు వారోత్సవాలను విజయవంతం చేయాలని పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ పిలుపునిచ్చారు.

పిఆర్టియు టిఎస్ ములుగు జిల్లా శాఖ అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సమన్వయ కర్త వేం యాకూబ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు పింగిళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ రేపటినుండి జరగబోయే సభ్యత్వ వారోత్సవాలలో ప్రతి పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులందరికీ సంఘం చేసిన కృషిని, పిఆర్సి సాధించడంలో, వయోపరిమితి పెంపు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసేలా సంఘం చేసిన కృషి ని వివరిస్తూ సభ్యత్వం స్వీకరించాల్సిందిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో మధ్యంతర భృతి ఇప్పించడం ,సిపిఎస్ రద్దుకై కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, పెండింగ్ బిల్లులు సమస్య ఈ నెలాఖరులోపు పరిష్కారం కాకపోతే ఉద్యమ కార్యాచరణ తో ముందుకు వెళ్తామని శ్రీపాల్ రెడ్డి తెలిపారు.ప్రస్తుత జిల్లా అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ అనారోగ్య కారణాలతో బాధ్యతలను బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన సందర్భంలో వారి రాజీనామాను ఆమోదం ఆమోదించి అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్న కాసర్ల రమేష్ ని అధ్యక్షుడిగా కొనసాగాలని రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ములుగు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా బిఅర్ఎస్ పార్టీ నుండి పాయ మానేశ్వర్ రావు ని అభ్యర్థి గా ప్రకటించాలని దేవులపల్లి సత్యనారాయణ అధ్యక్షతన, సమన్వయ కర్త వెం యాకూబ్ రెడ్డి సమక్షంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో 9 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల, ముఖ్య క్రియాశీల సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. పాయ మానేశ్వర్ రావు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి, తన ఉపాధ్యాయ సర్వీస్ ను వదిలి పెట్టి , ప్రజల మనలను అందుకొని సేవా తత్పరతో ములుగు నియోజకవర్గ అభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా శాసనసభ్యునిగా ఎన్నికైనట్లయితే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని, తాము విశ్వసిస్తున్నామని అందుకే పాయ మానేశ్వర్ రావు కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జిల్లా కార్యవర్గం తీర్మానం చేసింది.ఈ కార్యక్రమంలో పత్రిక ప్రధాన సంపాదకుడు మంచిర్యల జిల్లా అధ్యక్షులు ఇన్నారెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రేగూరి సుభా కర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ , రాష్ట్ర బాధ్యులు ధర్మయ్య, ముకుంద రెడ్డి, భూక్యా బాబు రావు,నారాయణ రావు,9 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ,సీనియర్ సభ్యులు,క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!