అనాద మృతునికి ఆఖరిమజిలి
పుట్టెడు దుఖంలోనూ పివి సురేష్ మానవత్వం

ట్రస్టు ఆధ్వర్యంలో అంత్యక్రియల నిర్వహణ
విశాఖపట్నం అఖండ భూమి..
తల్లి మరణం మిగిల్చిన వ్యధ..తండ్రి మృతిచెందారన్న బాధ ఆయనలోని సేవాభావాన్ని అడ్డుకోలేకపోయాయి. మదినిండిన దుఖాన్ని దిగమింగుతూనే సేవాసంకల్పానికి తొలి ప్రాదాన్యత ఇచ్చారు పివిఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్. నెలరోజుల వ్యవధిలోనే ఇంటి పెద్దలను కోల్పోయిన పుట్టెడు దుఖంలోనూ ఎవరో తెలియని ఓ అభాగ్యుడికి ఆఖరి మజిలీ నిర్వహించేందుకు ముందుకువచ్చి మానవత్వాన్ని చాటారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్యాణి ఆసుపత్రి సమీపంలో ఓ వ్యక్తి మృతిచెందాడన్న సమాచారం అందుకున్న ఆయన వెంటనే అక్కడకు చేరుకుని ట్రస్టు సభ్యుల సహకారంతో సదరు మృతునికి సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా మల్కాపురం సబ్ ఇన్స్పెక్టర్ దేవుడమ్మ సమక్షంలో అనాధ మృతదేహాన్ని కోరమండల్ స్మశానవాటికకు తరలించి సాంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మల్కాపురం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


