భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయండి
గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశం
అల్లూరి జిల్లా చింతపల్లి ( అఖండ భూమి)చింతపల్లి జూలై 23:
మ్యూజియం భవన్ నిర్మాణాలు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే అన్నారు. రూ. 35 కోట్లతో లంబసింగి వద్ద నిర్మిస్తున్న స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంపి థియేటర్ స్లాబ్ ను ఈ నెలాఖరు నాటికి, రెస్టారెంట్ ,గ్రౌండ్ ఫ్లోర్ స్లాబులను ఆగస్టు 15 నాటికి, మొదటి అంతస్తు స్లాబులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యూజియం బ్లాకు గోడల నిర్మాణం పనులు ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని సూచించారు. 20 మంది స్కిల్డ్ లేబర్ని, 80 మంది అన్ స్కిల్డ్ లేబర్ ని నియమించి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలికల ఆశ్రమం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనాలు మెనూ పరిశీలించారు. రూ 70 లక్షలు ఎస్సీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు రూ. ఒక కోటి 40 లక్షలతో నిర్మిస్తున్న కాఫీ గిడ్డంగి పనులను పరిశీలించారు.


