రౌడీ షీటర్లు ప్రజా శాంతికి భంగం కలిగిస్తే
కఠిన చర్యలు తప్పవు
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
బాపట్ల క్రైమ్ బ్యూరో జూలై 23 (అఖండ భూమి) : రౌడీ షీటర్లు ప్రజాశాంతికి ఎలాంటి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆదేశాలను, సూచనలను పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలుపరుచుట జరుగుతుందని పోలీస్ అధికారులు హెచ్చరించారు.



