Vijayawada: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై జారిపడిన కొండరాళ్లు
ఇంద్రకీలాద్రి: విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్ రోడ్ మీద పడ్డాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు ఆ మార్గంలో టోల్‌గేట్‌ను మూసివేశారు..
భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు..



