కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలోని 14 వ వార్డు నందు వాట్సాప్ నీరు వంకలను వాగులను తలపిస్తోంది. అధికారుల దృష్టికి ఎన్నో పర్యాయాలు తీసుకొచ్చినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. మేజర్ గ్రామపంచాయతీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారానికి నాంది పలకడం లేదని 14 వ వార్డు ప్రజలు వాపోతున్నారు. దీంతో మురుగునీరు కాలువల నీరు రోడ్లపైకి నిల్వ ఏర్పడి దోమలు క్రిములు కీటకాలు వ్యాప్తి చెంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వార్డు ప్రజలు తెలుపుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని క్షీణించిపోయిన కాలువను మరల నూతన కాల్వకు నాంది పలికి 14 వ వార్డు ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు పాలకులను అధికారులను కోరుతున్నారు.

