అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం: విజయసాయిరెడ్డి
మోదీ సర్కారుపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మణిపూర్ అంశంపై సమాధానం చెబుతానని హోంమంత్రి అమిత్ షా చెప్పారని విజయసాయి తెలిపారు.



