మావోయిస్టుల్లారా మా ఊరికి రావద్దు” మా అభివృద్ధి అడ్డుకోవద్దు “

 

మావోయిస్టుల్లారా మా ఊరికి రావద్దు” మా అభివృద్ధి అడ్డుకోవద్దు “గిరిజనులకు పనికిరాని వారోత్సవాలు ఎందుకు” సప్పర్ల సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టిన గిరిజనులు

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి / సప్పర్ల అఖండ భూమి వెబ్ న్యూస్ :

మావోయిస్టులారా మా ఊరికి రావద్దు మా అభివృద్ధిని అడ్డుకోవద్దు మాకు పనికిరాని వారోత్సవాలు ఎందుకు మేం పెట్టే తిండి తిని మా వాళ్ళని ఇన్ ఫార్మర్ లంటూ చంపేశారు అంటూ గూడెం కొత్త వీధి మండలం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం సప్పర్ల వారపు సంతలో గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించి తమ నిరసన తెలియజేశారు మావోయిస్టుల వల్ల వారి వారోత్సవాలు వల్ల గిరిజన యువతకు ఎటువంటి ఉపయోగం ఉందని శనివారం సప్పర్ల సంతలో యువకులు ర్యాలీ చేపట్టారు. వారి యొక్క ఉనికి చాటుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా గాలికొండ, అమ్మవారి దారకొండ వంటి పంచాయతీలలో గల గ్రామాలలో కనీస వసతులైన విద్య,వైద్యం మరియు రహదారులు వంటి అభివృద్ధి జరగనీయకుండా మా భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు మావోయిస్టులు చేసిన దశ్చర్యలు మరియు అమాయకులైన గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో జి కొత్తపాలెం గ్రామానికి చెందిన కొర్ర పులుకు అనే వ్యక్తిని మావోయిస్టులు చంపేశారు. అప్పుడు ప్రభుత్వం గిరిజనులకు ద్రోహం చేస్తుందని మావోయిస్టులు మాయమాటలు చెప్పి వారిని నమ్మించి,వారి మనుగడ కోసం మన గిరిజనులను అభివృద్ధికి దూరంగా ఉంచింది. అయితే దీనివల్ల గిరిజన ప్రాంతం ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేదు మరియు యువతకు ఉద్యోగ కల్పన అవకాశాలు కూడా కరువయ్యాయి అని, యువత మావోయిజం మాకు వద్దు… అభివృద్ధి ముద్దు… అని మావోయిస్టు వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా గిరిజన ప్రాంతాలలో సర వేగంగా గిరిజన గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్డు, నీరు, మరియు స్వయం ఉపాధి వంటి వాటిని కల్పిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుందని తెలిపారు. యువతకు అవసరమైన విద్య కోసం మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం సెల్ సిగ్నల్ కూడా ప్రతి మారుమూల ప్రాంతంలో కల్పిస్తున్నారు. గతంలో మావోయిస్టుల వలన తాము తీవ్రంగా నష్టపోయామని ఇప్పుడు మావోయిస్టులు తగ్గడంతో తమ ప్రాంతాలలో రహదారులు టెలి కమ్యూనికేషన్ వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి అన్ని రకాల కార్యక్రమాలు నిర్విరామంగా అమలు చేస్తుందని మళ్లీ వారోత్సవాలంటూ మావోయిస్టు మా వైపు రావద్దంటూ గిరిజనులందరూ ముక్తకంఠంతో జోరున వర్షం కురుస్తున్న మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. ఇప్పుడిప్పుడే మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలుగా పేరుగాంచిన అమ్మవారి దారకొండ గాలికొండ పంచాయితీ పరిధిలోని గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ప్రభుత్వం అందించే అన్ని రకాల కార్యక్రమాలు చేరుతున్నాయని ఇటువంటి సమయంలో మళ్లీ వారోత్సవాలంటూ మీరు వస్తే మాకు రావలసిన ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని ఇకపై మా ప్రాంతాలకు రావద్దంటూ ఈ ర్యాలీలో గిరిజనులు నినాదాలు చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!