జగనన్న కాలనీలో ఒక్క ఇల్లు కట్టని దుస్థితి సోషల్ ఆడిట్లో బయటపడ్డ వైనం

జగనన్న కాలనీలో ఒక్క ఇల్లు కట్టని దుస్థితి సోషల్ ఆడిట్లో బయటపడ్డ వైనం జగనన్న కాలనీలు ఒక్క ఇల్లు కూడా మంజూరు కానీ వైనం…లబోదిబోమంటున్న లబ్ధిదారుడు వైసీపీ నాయకులకు దమ్ముంటే బహిరంగ చర్చకు సవాల్ విసిరిన జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జి గంగులయ్య

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (జి మాడుగుల) (అఖండ భూమి)

రాష్ట్ర ప్రభుత్వం పని తక్కువ ప్రచారం ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి వంపురి గంగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా జిమాడుగుల స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జగనన్న కాలనీలు ఏజెన్సీ ప్రాంతంలో లబ్ధిదారుడికి ఒకటిన్నర సెంటు భూమి ఇస్తున్నామని ఇల్లు కట్టుకోమని చెప్పి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని అలాగే శంకుస్థాపనలు తప్ప పునాదులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ఈ విషయంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.జగనన్న కాలనీలు సందర్శించడానికి సోషల్ ఆడిట్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తరుణంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటునుండి నేటి వరకు సుమారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఒక్క లబ్ధిదారుడు కూడా ఏజెన్సీలో ఇల్లు కట్టుకో పోవడం ఈ విషయం బహిర్గతం కావడం చాలా బాధాకరమని ఆయన వెల్లడించారు . కొన్ని మండలాల్లో జగనన్న కాలనీలకు కొద్దిపాటి భూమిని సేకరించి అస్తవ్యస్తంగా ఎవరికి వారు సెంటు సెంటున్నర చొప్పున పట్టాలిచ్చినప్పటికీ వారికి కూడా స్థలాలు చూపించలేని పరిస్థితి ఈనాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నెలకొందని పేర్కొన్నారు.మరి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేనప్పటికీ ప్రచార హార్భావటంలో ముందు ఉండి గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా జగనన్న కాలనీలు గాని ఒక ఇల్లు అయినా చూపించగలరా అని ఆయన అధికారి పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని చెందిన ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా రేపు పొద్దున ఓటు కోసం ఏ మొఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వస్తారని ఆయన ఆరోపించారు .కనీసం ఎన్నికల ముందు అయినా జగనన్న కాలనీ ఇల్లులు లబ్ధిదారులకు మంజూరు చేయాలని ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు .లేని పక్షంలో జిల్లా కేంద్రంలో ఐటీడీఏ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.ఇప్పటికైనా గిరిజన ప్రాంతంలో ఆదివాసి ప్రజలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈర్ష గుణం విడనాడాలని ఆయన హితవు పలికారు .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిమాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, గొంది మురళి, జర్ర అంకిత్, సాగని ఈశ్వరరావు ,షేక్ మస్తాన్ ,తాంగుల రమేష్, జల్లి బుజ్జిబాబు ,త్రిమూర్తులు, సత్యారావు ,తెరవాడ బాలకృష్ణ ,లొంజా శ్రీకాంత్ అధిక సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!