మూడో దశ ఉద్యమ కార్యాచరణను వెల్లడించిన ఏపీ జేఏసీ ఛైర్మన్..
Bopparaju Venkateswarlu Revealed Third Phase Of Agitation: ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా మూడో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు..
ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము రెండు దశల్లో ఉద్యమం పూర్తి చేస్తామన్నారు. ఆయన మాట్లాడుతూ.. ”ఏపిలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ తరఫున రెండు దశల్లో ఉద్యమం పూర్తి చేశాం. రెండో దశ ఉద్యమం పూర్తవుతున్న నేపథ్యంలో.. మూడో దశ ఉద్యమ పోరాటంపై ఉద్యోగసంఘాలతో పాటు కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. రౌండ్ టేబుల్ సమావేశం ముందు రోజు మంత్రి ఉపసంఘం చర్చలకు పిలిచింది. ఈ భేటీలో ఏ అంశం తేలకపోవడంతో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో కార్మిక సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి” అంటూ తెలిపారు. తాము నల్లబ్యాడ్జీలు ధరించే ఉంటామని.. 8వ తేదిన ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఉపసంహరించాలని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు..
9వ తేది నుండి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు.. మొదటి సదస్సును శ్రీకాకుళం నుండి ప్రారంభిస్తామన్నారు. ఈ సదస్సుకు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా ఉద్యోగులు హాజరవుతారన్నారు. 53 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెతన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మే 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉద్యోగుల ఆవేదన చెబుతామనే కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకు, 25 ఎంపీలకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. రెండో ప్రాంతీయ సదస్సు అనంతపురం, మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో నిర్వహిస్తామన్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



