వరద బాధిత కుటుంబాలకు వాసవి ట్రస్ట్ సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ.
ఏటూరు నాగారం ప్రతినిధి, అఖండ భూమి వెబ్ న్యూస్ :
ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలమేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ,జిల్లా నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న ,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ , మండల అధ్యక్షులు చిటమట రఘు సూచనలమేరకు జిల్లా నాయకులు గుడ్ల దేవేందర్ అధ్యక్షతనలో ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామాంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాల మూలాన బాధిత కుటుంబాలకు వాసవి ట్రస్ట్ ల సహాయ సహకారంతో మొత్తం 95 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి బియ్యం,దుప్పట్లు, పప్పు, నూనె ప్యాకెట్స్ 9 రకాల నిత్యావసర సరుకులను మండల కాంగ్రెస్ నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా నాయకులు గుడ్ల దేవేందర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల ప్రజలు దైర్యంగా ఉండండి మీకు అండగా మేము ఉంటామని సీతక్క పిలుపుతో రాష్ట్ర నలుమూలల నుండి బాధిత కుటుంబాలకు సాయం చేయడానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 వేల ఆర్థిక సాయంతో పాటు వరుదల్లో కొట్టుకు పోయి మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు ఖలీల్ ఖాన్ ,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్, టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డోంగిరి మధుబాబు, టౌన్ ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకటనారాయణ, శేషు, సావిత్రి,యూత్ నాయకులు నాగవత్ కిరణ్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..