పుంగనూరు ఘటనపై మండల టిడిపి నాయకులు నిరసన
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి (అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఆగస్టు 5 రాజవొమ్మంగి
గ్రామంలో మండల టిడిపి నాయకులు పుంగనూరు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, రాజవొమ్మంగి అల్లూరి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో టిడిపి మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు, ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ మన రాష్ట్రం రౌడీల రాజ్యాంగా మారిందని అధికార పార్టీల నాయకులు కార్యకర్తలు అన్యాయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అలాగే టిడిపి కార్యకర్తలపే రాళ్లు విసరడం లాటిచార్జి చేయించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు, పులివెందులలో చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైసిపి నాయకులు వోర్వలేక ఈ దాడికి దిగారని, రాబోయే కాలంలో కచ్చితంగా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దింపుతారని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, ముప్పన డింభ కేశవ్, ముప్పన మోహన్, జెట్టి మధు, మరిచెట్ల శ్రీను, తానారపు శ్రీను, బెల్లంకొండ గుప్తా టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు