పాయకరావుపేట పరివర్తన నిలయం లో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత మృత వీరుల చిత్ర పటానికి పార్టీఅధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పూలమాల వేసి కన్నీటి నివాళులు అర్పించారు ఈసందర్బంగాఅయనమాట్లాడుతూ1991 ఆగష్టు 6 న గుంటూరు జిల్లా చుండూరు దళిత వాడ పై రెడ్డి భూస్వామ్య హంతక ముఠా జరిపిన దాడి హత్యాకాండలో 11 మంది దళితులను నరికి చంపారని ఈ ఘటన లో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రభుత్వ పోలీస్ రాజకీయ వ్యవస్థలు చివరకి న్యాయవ్యవస్థ కూడా కుట్రలు చేసి బాధితులకు తీవ్రంగా అన్యాయం చేసారు ఈ కేసులో హంతకుల మీద ఉన్న హత్య కేసులు కొట్టేశారు ఈ హత్య కాండ దాడులు పైన సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేయడం జరిగిందన్నారు ఈ కేసును బెంచ్ కి రానీయకుoడా జగన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటుందని కృష్ణ స్వరూప్ ఆరోపించారు జగన్ రెడ్డి ఇటీవల తన బర్త్ డే కార్యక్రమం ను చుండూరు లోనే జరుపుకొని హంతక రెడ్డి భూస్వామ్య సామాజిక వర్గంనకు జగన్ రెడ్డి అండగా నిలిచి దళిత జాతి కి సవాల్ చేసారని విమర్శలు చేసారు దేశ వ్యాప్తంగా దళిత జాతి పైన దాడులు హత్యాచారాలు జరుగుతున్న అగ్రకుల పాలక ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ కోర్ట్ లు సైతం దళితులకు అన్యాయం చేస్తున్నారని బాధితులకు రక్షణక ల్పించటలేదన్నారు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలను ఈ పాలకులు అమలు చేయటం లేదన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1989 చట్టం ను ప్రభుత్వం పోలీస్ యంత్రాంగమే కుట్ర పూరితo గా నీరు కారుస్తున్నారని ఆరోపించారు రాజ్యాధికారం దళిత జాతి చేతులో లేకపోవడం వలనే ఈ దారుణ హత్యకాoడలు జరుతున్నాయన్నారు చుండూరు మృత వీరుల పోరాట స్ఫూర్తి తో ప్రతిఘటన పోరాటాలకు దళిత జాతి సిద్ధం కావాలన్నారు అలాంటి నాయకులకు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు అంతే కాకుండా పొలిటికల్ పవర్ సాధన ద్వారానే దళిత జాతికి రక్షణ విముక్తి వస్తుందన్నారు లేకపోతే బానిసత్వం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా అధ్యక్షులు దువ్వాడ దావీదు చిట్టుమురి గోవింద్ జెక్కల సూరిబాబు చిరుకూరి రమణ బాబు చిరుకూరి అర్జునరావు మాలమహానాడు అసెంబ్లీ ఇంచార్జ్ మార్తి సింహాచలం తదితరులు పాల్గొన్నారు
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య