రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఉత్తర్వుల మేరకు సమ్మె ఉధృతం..

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అఖండ భూమి వెబ్ న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు అధికారులు సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విధులనుండి సిమ్ములు హ్యాండ్ ఓవర్ చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం.

విద్యుత్ సంస్థలు చాలా సంవత్సరాలుగా మా న్యాయమైన సమస్యలు తీర్చమని కనీసం 20, 30 పర్యాయాలు రాష్ట్ర జేఏసీ నాయకత్వం అటు మేనేజ్మెంట్తో ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. 2022లో రాష్ట్ర జేఏసీ ఇదేవిధంగా స్ట్రైక్ నోటీసు ఇచ్చినప్పుడు రాష్ట్ర జేఏసీ నాయకులను తో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ పై గౌరవంతో మా రాష్ట్ర జేఏసీ స్ట్రైక్ విరమింప చేసింది అప్పటినుండి ఈరోజు వరకు దపదపాలుగా చర్చించినా కూడా ఏ ఒక్క సమస్య నెరవేర్చలేదు కావున విధి లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా మరల మా రాష్ట్ర జేఏసీ స్ట్రైక్ నోటీసు ఇవ్వడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు సమ్మె చేయడం ప్రత్యేకంగా విద్యుత్ శాఖ చేయడం వేరు ఎందుకంటే మానవ జీవన సంబంధంలో ఒక భాగం అయిపోయింది విద్యుత్ లేని జీవితాన్ని ఊహించలేం ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు విద్యుత్ లేకపోతే హాస్పిటల్ రోగుల పరిస్థితి ఇబ్బందిగా మారవచ్చు అసలు త్రాగునీరే లేకపోవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరల రాష్ట్ర జేఏసీ నాయకులు ఎన్నిసార్లు చర్చలు జరిపిన ఎలాంటి పురోగతి చెందలేదు. తప్పని పరిస్థితిలో విధి లేని పరిస్థితుల్లో మాకు బాధగా ఉన్న మా రాష్ట్ర జేఏసీ రెండవ సారి స్ట్రైట్ నోటీస్ ఇచ్చి జూలై 27-7-2023వ తేదీ నుండి వివిధ రూపాల్లో కార్యాచరణ ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో మరల మూడు పర్యాయాలు చర్చలకు పిలిచి ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర జేఏసీ నాయకులను అవమానకరంగా మాట్లాడి వారి ప్రతిపాదన మాత్రం చెప్పి కనీస విలువ ఇవ్వకుండా చర్చల మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది. కార్యాచరణలో భాగంగా 8-08-23వ తేదీ మంగళవారం విజయవాడ లో మహా ధర్నా కార్యక్రమానికి వెళ్ళనీయకుండా ఎక్కడికక్కడ విద్యుత్ ఉద్యోగులను రకరకాలుగా అడ్డగించి నోటీసులను సర్వ్ చేసి హౌస్ అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టి మమ్ములను సంఘ విద్రోహులుగా నేరస్తుడిగా మమ్ములను పోలీస్ బలగంతో మమ్ములను విజయవాడ మహా ధర్నాకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం ఈ ప్రజాస్వామ్యంలో న్యాయమా ఇదెక్కడి చట్టం.

 

ఈ రోజు 09 -08 – 2023 అర్ధరాత్రి 12 గంటల నుండి జరగబోవు నిరవధిక సమ్మె కావున ఆ రోజు నుండి విద్యుత్ అంతరాయంపై వచ్చు సమస్యలను విద్యుత్ ఉద్యోగులందరూ హాజరు కారు దీనివల్ల ప్రజలకు వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలిగిన నష్టం ,కష్టం కలిగిన దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వానిదే. 10-8- 2023 నుండి విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే పునరుద్ధరించడం కుదరదు కావున ప్రజలు వినియోగదారులు ముఖ్యంగా హాస్పటల్ వారు విద్యుత్ ప్రత్యామ్యాలు ముందే సమకూర్చుకోవాలని వినియోగదారులను వేడుకుంటున్నాం.

ఇప్పటివరకు రాత్రి అయిన పగలైనా ఎండైనా వానైనా 24 గంటలు మీకు మెరుగైన సేవలందించడంలో కష్టపడ్డాం మా న్యాయమైన సమస్యలు పరిష్కారానికి ప్రతి ఒక్క వినియోగదారుడు సహకరించాలని ప్రార్థిస్తున్నాము

Akhand Bhoomi News

error: Content is protected !!