మూడో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలి. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర

జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్

నర్సీపట్నం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన మూడవ విడత వారాహి విజయ యాత్ర ఈ నెల 10వ తేదీ నుండి విశాఖలో ప్రారంభమవుతుందని, ఈ యాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం వారాహి యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఇప్పటికే వారాహి యాత్రకు విశేషమైన స్పందన వస్తోందన్నారు. రాష్ట్రంలో వైసిపి నిరంకుశ పాలనలో జనం విసుగెత్తిపోయారన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టే వారాహి విజయయాత్రను అడ్డుకునేందుకే పోలీస్ చట్టం 30 యాక్టును అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా వైసిపి చేస్తున్న భూదోపిడిలను, అక్రమాలను, కబ్జాలను బహిర్గతం చేసేందుకు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భయపడి పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీసు 30 యాక్టు ఉపయోగించి జనసైనికులను, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యాత్ర ను అడ్డుకోవాలని చూస్తుందన్నారు. వైసిపి చేస్తున్న ఆరాచకాలు, భూకబ్జాలు, దోపిడీలను యావత్ ప్రపంచానికి తెలియజేసేలా ఈ యాత్రను రూపొందించారని, దీనిపై భయం పెట్టుకున్న వైసిపి ప్రభుత్వం ఇటువంటి యాక్టులు పెట్టి వారాహిని అడ్డుకోవాలని చూస్తుందన్నారు. ఎన్ని యాక్టులు పెట్టుకున్నా వారాహి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. 10వ తేదీ నుంచి జరిగే వారాహి యాత్రను నర్సీపట్నం నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, టౌన్ నాయకులు మారిశెట్టి రాజు, 12వ వార్డు ఇన్చార్జ్ గూడెపు తాతబాబు, గొలుగొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి. 2వ వార్డు ఇన్చార్జ్ మొండి శివ, మాకవరపాలెం నాయకులు సప్పా నానాజీ, నమ్మి మంగరాజు, నమ్మి రమణరాజు, నర్సీపట్నం రూరల్ నాయకులు గంగాధర, బంగారు నాయుడు, గొలుగొండ మండల నాయకులు ఠాగూర్, వాకా సంతోష్, వాసం వెంకటేష్, పైల కొండబాబు, డాక్టర్ కోనా నారాయణరావు, ఇ.ఓంకార్, కర్రి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!