కమ్మ కులస్తులకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలి….

 

 

కమ్మ కులస్తులకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలి…… రాజకీయాలకతీతంగా కమ్మ కులస్తులు ఐక్యం కావాలి… అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాల్లో కమ్మ కులస్తులకు టికెట్ ఇవ్వాలి… గ్రామస్థాయి నుండి పార్లమెంట్ వరకు కమ్మ కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.. అసెంబ్లీలో 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి…. కోదాడ లో కమ్మ రాజకీయ ఐక్యవేదిక సమావేశంలో మాజీ పీసీసీ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, డాక్టర్ గోపాలం విద్యాసాగర్…… కమ్మ కులస్తులకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని మాజీ పిసిసి అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్, తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక బాధ్యులు డాక్టర్ గోపాలం విద్యాసాగర్లు రాజకీయపక్షాలకు డిమాండ్ చేశారు. ఆదివారం కోదాడ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర ఫంక్షన్ హాల్ లో కమ్మ రాజకీయ ఐక్య వేదిక సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కమ్మ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజకీయాలకు అతీతంగా కమ్మ కులస్తులు ఏకమై సామాజిక వర్గాన్ని గెలిపించుకోవాలన్నారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు కమ్మ కులస్తులకు పూర్తిగా విస్మరించాయన్నారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఆయా రాజకీయ పక్షాలు కమ కులస్తులకు సామాజిక న్యాయం కల్పించాలన్నారు. కమ్మ కులస్తుల రాజకీయ ప్రాతినిధ్యం కోసం కమ్మ రాజకీయ ఐక్యవేదిక పోరాడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 10 ఎమ్మెల్యే టికెట్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కమ్మ కులస్తుల రాజకీయ ప్రాబల్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్యవేదిక సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున కార్యచరణను రూపొందిస్తామన్నారు కమ్మ కులస్తులు అందరూ రాజకీయ ఐక్యవేదికకు సహకారాలు అందించాలన్నారు. కాగా ఈ సమావేశానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి కమ్మ రాజకీయ వేదిక సభ్యులు నాయకులు భారీగా తరలివచ్చారు స్థానిక ఐక్యవేదిక నాయకులు ముతవరపు పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నాయకులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!