కాకినాడ జిల్లా ఎంబీసీ సాధికార సమితి అధ్యక్షునిగా ధనకొండ నల్లయ్య నియామకం

 

 

కాకినాడ జిల్లా ఎంబీసీ సాధికార సమితి అధ్యక్షునిగా ధనకొండ నల్లయ్య నియామకం

జ్యోతుల నెహ్రూ ను మర్యాదపూర్వకంగా కలిసిన మల్లయ్య

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 13: (అఖండ భూమి) కాకినాడ జిల్లా ఎంబీసీ సాధికార సమితి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ధనికొండ నల్లయ్య స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.ధనకొండ పెద్దిరాజు (ఎంబీసీ స్టేట్ కమిటీ డైరెక్టర్ పెద్దాపురం) తో కలిసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా నల్లయ్యను నెహ్రూ సన్మానించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ మా నియోజకవర్గం నుంచి ఎంబీసీ సాధికారక జిల్లా అధ్యక్షునిగా వేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర కు లెటర్ పంపించడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి నల్లయ్యను జిల్లా అధ్యక్షుడిగా నియమించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సంచార జాతులైనటువంటి 32 కులాలకు తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేస్తూ చంద్రబాబు ఎంబీసీ సాధికార సమితి వేయడం జరిగిందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్నగారిన కులాలు అణిచివేతకు గురయ్యాయని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తూ మీరంతా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు,ఎంబిసి సాధికార సమితి సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!