తాండవ నదిలో పక్కా గ్రోయిన్స్ నిర్మించండి..

 

తాండవ నదిలో పక్కా గ్రోయిన్స్ నిర్మించండి..

జనసేన పార్టీ నాయకుడు అంకారెడ్డి రాజశేషు డిమాండ్..

కోటనందూరు (అఖండ భూమి):

తాండవ నదిలో కామినీడు కాలువకు,దిగువాల కాలువకు పర్మినెంట్ గ్రోయిన్స్ నిర్మించాలని, ఇండుగపల్లి గ్రామంలో రామరాజు ఆనకట్ట నిర్మించాలని జనసేన పార్టీ నాయకులు అంకా రెడ్డి రాజశేషు డిమాండ్ చేశారు..

తుని నియోజకవర్గం జనసేన నాయకులు కోటనందూరు కామినీడు గ్రోయిన్స్ , ఇండుగపల్లి రామరాజు ఆనకట్టను సందర్శించారు.

కోటనందూరు తాండవ నది లో గ్రోయిన్లు వరదల్లో కొట్టుకుపోవడం వల్ల ఈ గ్రోయిన్లు పంట కాలువలు ద్వారా పంట పొలాలకు నీరు అందడం లేదని, ఈ కాలువుల క్రింద సుమారు 1350 ఎకరాలు సాగవుతుందని, కేఏ. మల్లవరం, బొద్దవరం , టిజే నగరం, పోలవరం, అర్తమూరు , అలాగే రామరాజు ఆయకట్టులో ఉన్న కొన్ని గ్రామాల రైతులు నష్టపోతున్నారని, ఖరీఫ్ సీజన్ మొదలయ్యేటప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టిన , అవి మరలా కొట్టుకుపోతున్నాయని అన్నారు..

రామరాజు ఆనకట్టకు కోటి 30 లక్షల రూపాయలు అంచనా వేసిన ఇరిగేషన్ శాఖలో నిధులు లేక పనులను చేయలేకపోయినట్లు అధికారులు తెలియజేసినట్లు కోటనందూరు జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ నక్కా రాము తెలియజేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పర్మినెంట్ గ్రోయిన్స్ నిర్మించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పెనుముచ్చు ప్రవీణ్ కుమార్, అమలకంటి రాజా, కూనిశెట్టి నాగేశ్వరరావు, అల్లవరపు సురేష్, గంటా దుర్గాప్రసాద్, అల్లు రాజబాబు, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!