స్వాతంత్ర్య దినోత్సవం రోజు అక్రమ బెల్టు షాపుల నిర్వహణను నియంత్రించాలి – తట్టా శ్రీనివాస్

అనకాపల్లి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అక్రమ బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని మాల మహానాడు అనకాపల్లి జిల్లా ఇంఛార్జి తట్టా శ్రీనివాస్ అన్నారు పవిత్రమైన దేశస్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టు మహాత్మా గాంధీ జయంతి రోజుల్లో ప్రభుత్వం మధ్యం అమ్మకాలను నిషేధించిన సంగతి విధితమే కానీ ఆ రెండు రోజుల్లోనే ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమ బెల్టు షాపుల్లో మధ్యం నాటుసారా అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారని అందువల్ల ప్రభుత్వ ఆదాయానికి ఘండి పడుతుందని ఇది అధికారుల వైఫల్యమేనని ఆయన అన్నారు ప్రభుత్వ ఆదేశాలను నిబంధనలను అమలు చేస్తే ఈ రోజు అక్రమ బెల్టుషాపులు ఏర్పడేవి కావని ఆయన అన్నారు ఇప్పటికైనా అక్రమ బెల్టు షాపులను గుర్తించి ఆ రెండు రోజుల్లోనే రహస్య పద్ధతిలో ముందస్తు సమాచారం అక్రమ బెల్టు షాపులకు తెలియజేయకుండా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు

Akhand Bhoomi News

error: Content is protected !!