బమ్మిడికలొద్ది లో అక్రమ మైనింగ్ – సందర్శించిన జిల్లా కలెక్టర్

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమ్మిడికలొద్ది అటవీ ప్రాంతంలో లాటరైట్ ఖనిజ అనధికార త్రవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి సందర్శించి పరిశీలించారు ఆయన మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆదేశాల మేరకు సందర్శించడం జరిగిందని పూర్తి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి మరొకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి పంపిస్తామని అన్నారు జిల్లా దళిత ప్రగతి ఐక్య సంఘం అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య మాట్లాడుతూ ఖనిజాన్ని తరలించడం కోసం అటవీ ప్రాంతం నుంచి రౌతులపూడి వరకు సుమారు 28 కిలోమీటర్లు రహదారిని నిర్మించారని దీనికోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు అంతేకాకుండా వేల సంఖ్యలో అధిక విలువచేసే వృక్షాలను నరికేసారని చాలా వన్యప్రాణులను చంపేశారని ఆయన అన్నారు ఈ మైనింగ్ కార్యకలాపాల కారణంగా పర్యావరణానికి నష్టం వాటిల్లిందని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు ఈ మైనింగ్ ప్రాంతం పరిసరాలలో అనేక మంది గిరిజన ప్రజలు నివసిస్తున్నారని ఈ మైనింగ్ కార్యకలాపాల వల్ల గాలి నీరు కాలుష్యమై ప్రజలు,వన్యప్రాణుల మనుగడకు ఆటంకం కలిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని  ఆయన అన్నారు గతంలో ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా యధావిధిగా మైనింగ్ కార్యకలాపాలు తరచుగా జరపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని ఆయన అన్నారు ఈ మైనింగ్ కార్యకలాపాల వల్ల విషపూరిత లోహాలు మరియు ఆమ్లాలు మట్టిని కలుషితం చేస్తాయని నీటి వనరులు జీవుల జీవనం సహజ వనరులు ఘననీయంగా నష్టపోతాయని పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయని విషపూరిత లోహాలు జీవులలోకి ప్రవేశించి ముఖ్యమైన అవయవాలు పాడై వ్యాధుల బారిన పడి బయోఎక్యుములేషన్ జరిగి తీవ్ర నష్టం ఏర్పడు తుందని స్థానికులు వాపోతున్నారని ఆయన అన్నారు ఈ కార్య క్రమంలో మైనింగ్ అధికారి సుబ్బారాయుడు జిల్లా అటవీ అధికారి రాజారావు మండల తహసిల్దార్ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!