జొన్నాడ వద్ద భారీగా గంజాయి పట్టివేత.ఇద్దరు నిందితుల అరెస్ట్.
ఆలమూరు (అఖండ భూమి వెబ్ న్యూస్ : అక్రమంగా గంజాయితో వెళుతున్న వాహనాన్ని 216ఏ జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద ఆలమూరు పోలీసులు దాడిచేసి పట్టుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు.ఆలమూరు ఎస్ఐ ఎస్.శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి జిల్లా ఏజన్సీ ప్రాంతం నుండి మహరాష్ట్రలోని ముంబాయికి గంజాయి తరలిస్తున్నట్లు,మహారాష్ట్రకు చెందిన సునీల్ అప్పా బోరాడే,ఇస్లాం నయి మొహిద్దిన్ షేక్ లు కంటైనర్లో ఇటివల వచ్చిన సినిమాలో మాదిరి ప్రత్యేకంగా తయారు చేసిన డ్రైవర్ క్యాబిన్ లో రహస్యంగా అమర్చిన బాక్సులలో 345.42 కిలోల గంజాయిని 17 బస్తాలలో ఉంచి తరలిస్తుండగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ ఆంజనేయస్వామి ఆలయం వద్ద జాతీయరహదారిపై కొత్తపేట డిఎస్పీ కెవి రమణ ఆదేశాల మేరకు,రావులపాలెం సిఐ ఎన్ రజనీకుమార్,ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ లు పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుపడినట్లు చెప్పారు.ఈ గంజాయి విలువ దాదాపు రూ.10.36లక్షల ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.ఈమేరకు నిందితులు ఇరువురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలియజేసారు.



