యువగళం లోకేష్ పాదయాత్ర 2500 కిలోమీటర్ల పూర్తి …

 

 

యువగళం లోకేష్

పాదయాత్ర 2500 కిలోమీటర్ల పూర్తి

టీడీపీ గుంటూరు జిల్లా యస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ

గుంటూరు జిల్లా ఆగష్టు 20 అఖండ భూమి వెబ్ న్యూస్ :

రాష్ట్రములో యువగళం పాదయాత్ర మొదలుపెట్టే ముందు ఎగతాళి చేసిన వారికి పాదయాత్ర తో లోకేష్ బాబు బుద్ది చెప్పారని మేడా రామకృష్ణ పేర్కొన్నారు.

ఎండనక వాననక ,ప్రజలతో మమేకమై, ప్రజల నడకల్లో , నడకై, నడుస్తూ కాలికి బొబ్బలెక్కిన పట్టించుకోకుండా ప్రజల సమస్యలను లేవనెత్తుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తిచేసుకుని తెలుగుదేశానికి సూపర్ సిక్స్ పథకాలను అందించి పూలబాటను పరిచిన మన యువ నాయకుడు లోకేష్ బాబు అని తెలిపారు

ఆ యువగళం నడకకే ఈరోజు వైయస్సార్సీపి తుడిచి పెట్టుకుని పోయింది.బై ఎలక్షన్స్ సర్పంచుల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇచ్చిన సర్పంచులు విజయకేతనం ఎగురవేయడానికి దోహదపడిందని సందేహం లేకుండా చెప్పవచ్చు కార్యకర్తల్లో నూ, నాయకుల్లోను నూతన ఉత్సాహాన్ని నింపారని మేడా రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

ఆ యువ నాయకునికి శుభాభివందనములు పలుకుతూ, ఇంకా అనుకున్న లక్ష్యాన్ని చేరే విధంగా పయనించాలని మేము సైతం మీతో ఉంటామని మేడా రామకృష్ణ తెలిపారు.ఈ సైకో పాలనతో విసుగెత్తి పోయారన్నారు.2024 లో ఈ సైకో పాలన ను తరిమికొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సైకో పోవాలి – సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని మేడా రామకృష్ణ కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!