పకడ్బందీగా పక్క ప్రణాళికతో పనిచేయాలి: మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాబురావు

 

 

పకడ్బందీగా పక్క ప్రణాళికతో పనిచేయాలి: మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాబురావు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి (అఖండ భూమి) ఆగస్టు20: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో ఆదివారం బిజెపి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాపురావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే రౌడీ రాజకీయాలు. ఆయన సంపాదన చూసి ఆశ్చర్యపోయానని. తెలంగాణ రాష్ట్రంలో నే అత్యంత దోపిడీకి గురైన నియోజకవర్గ ఏదైనా ఉందంటే అది ఆర్మూర్ నియోజకవర్గమే అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరించడం. అక్రమ కేసులు పెట్టడం. రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో 8 రోజులపాటు ఉండి ప్రతి మండలానికి తిరిగి బిజెపి కార్యకర్తలను ఉత్సాహపరిచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి నరేంద్ర మోడీ గెలుపునకు కృషి చేస్తామని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బూతు కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయం అవుతుందని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పకడ్బందీగా పక్క ప్రణాళికలతో ముందుకు సాగాలని బిజెపి పార్టీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త. బూత్ కమిటీలు. నాయకులు కలిసి పని చేస్తే గెలుపు సునయాసమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్. పెద్దోళ్ల గంగారెడ్డి. జీవి నరసింహారెడ్డి. పైడి రాకేష్ రెడ్డి. విజయభారతి. యామాద్రి భాస్కర్. నూతుల శ్రీనివాస్ రెడ్డి. జెస్సు అనిల్. వివిధ మండలాల అధ్యక్ష. కార్యదర్శులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!