నాతవరం మండలం గునుపూడి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందని సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యమని దీనిపట్ల గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని సబ్బవరపు దేవుడు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో మురికి కాలువల లో చెత్త మట్టి పేరుకుపోయి కాలువలలో నీరు నిల్వ ఉండడం తో అవి దోమల వృద్ధి కి ఆశ్రయాలుగా మారాయని ఆయన అన్నారు దీని వలన ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆసుపత్రులు పాలవుతున్నా నివారణ చర్యలు తీసుకోవడంలేదని సబ్బవరపు దేవుడు అన్నారు అంతేకాకుండా స్థానిక గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ్యం క్షీణించి ప్రమాదకరంగా మారిందని పాఠశాల లో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని తరగతి గదుల పరిసరాలలో మురికి గుంతలు వలన దోమలు వృద్ధి చెంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని కనీసం గుంతలను మట్టితో పూడ్చడం లేదని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి చూపుతున్నారని ఆయన వాపోయారు ఇప్పటికైనా అధికారులు గ్రామంలోని ప్రజా సమస్యలపట్ల స్పందించి తక్షణమే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు లేని పక్షంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఆయన తెలిపారు

ANDHRA BUSINESS HEALTH NEWS PAPER

