పెందుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల క్లబ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ప్రతీ పాఠశాలలో వినియోగదారుల క్లబ్ ( కన్స్యూమర్ క్లబ్ ) ఏర్పాటు చేయాలని , విద్యార్థి దశ నుండి వినియోగదారుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిపించడం ఈ క్లబ్ ల యొక్క ఏర్పాటు లక్ష్యమని పాత పెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కన్స్యూమర్ క్లబ్ లో రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ( క్యాప్కో ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.ఎస్.రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మూల్యం చెల్లించే పలు వస్తువుల కొనుగోలు, రుసుము చెల్లించి పొందే సేవలపై వినియోగ దారులకు హక్కులు ఉంటాయని,2019 వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ఎక్కడ వస్తువును కొనినా పిర్యాదు దారుడు నివాసం ఉన్న కన్స్యూమర్ కమిషన్ లొ కేసు వేసుకొని అవకాశం 2019 చట్టం కలిపించబాడిదని తెలిపారు.ఆన్లైన్ చెల్లింపు చేసిన వివరాలతో మోసాలకు పాల్పడే అమ్మకపుదారుల ఆట కట్టించవచ్చును అని రామకృష్ణ తెలియజేసారు.జెడ్పీ హెచ్చేస్ ఇంఛార్జి హెచ్ ఎమ్,వినియోగదారుల గైడ్ టీచర్ సేహెచ్. జగదీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థుల కమిటీ ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ హిత వ్యవస్థాపకులు కే వీ ఎస్ నరసింహం పాల్గొని విద్యార్థులకు వినియోగదారులు గా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో వివరించారు. పాఠశాల విద్యార్థులకు 2019 చట్టం పై ప్రతిభా పోటీలను నిర్వహించి పోలుగోనా వారికి ప్రశాంసా పత్రం ప్రదానం చేశారు.



