మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని తహశీల్దార్ కి వినతి పత్రం అందజేసిన మాల మహానాడు జిల్లా కో ఆర్డినేటర్ – గోవింద్

రౌతుల పూడి లో పిడుగు పాటుకు గురై మృతి చెందిన గంపా సత్యవతి కుటుంబం ను ఆర్ధికంగా ఆదుకోవాలని మండల తహశీల్దార్ భీమారావు కి మాలమహానాడు జిల్లా కో ఆర్డినేటర్ చిట్టిమూరి గోవిందు వినతి పత్రం అందజేశారు ఆయన మాట్లాడుతూ పొట్ట కూటి కోసం పిల్లల పోషణ కై కూలి పనులకు వెళ్లి పిడుగు పడి మృతి చెందిన సత్యవతికి ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆమె మృతి తో పిల్లలకు సరైన ఆహారం ఆధరణ లేక పోవడం తో పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారి వారి కుటుంబం చిన్నాభిన్నమై పోయిందని ఆయన అన్నారు అయితే ఆమె భర్త కూడా చాలా రోజులు గా అనారోగ్యం తో బాధపడుతున్నారన్నారు ఇలాంటి దయనీయ పరిస్థితిల్లో ఉన్న వారి కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలని గోవింద్ అన్నారు అయితే ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులు ప్రజా ప్రతినిధులు ఇలాంటి సంఘటన జరిగితే వారాలు గడిచినా బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించక పోవడం బాధాకరమని ఆయన అన్నారు అంతే కాకుండా గతంలో ఇలాంటి సంఘటనలు గ్రామం లో జరగగా ఎమ్మెల్యే తో పాటు స్థానిక నాయకులు వారిని పరామర్శించి ఆర్ధికం గా ఆదుకొనే వారు కానీ ఈ సంఘటన లో మృతురాలు ఎస్సీ మహిళ కావడం తో కుల వివక్షత తో ఏ ప్రజా ప్రతినిధి కనీసం కుటుంబం పట్ల స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు ఈ సంఘటన ను ఎమ్మెల్యే దృష్టి కి వెళ్లకుండా కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని కుటుంబ సభ్యులు బాధ పడ్డారని ఆయన ఇప్పటికైనా ఆయన స్పందిస్తారని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్య క్రమం లో మృతురాలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!