హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం..

 

 

హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం..

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో పెద్ద సంఖ్యలో కార్లలో బయల్దేరారు..

ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎస్సార్‌ నగర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ర్యాలీగా వెళ్లారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించి సంఘీభావం తెలపనున్నారు.

మరోవైపు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణాటాటా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ- ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!