సముద్ర కాలుష్యాన్ని తగ్గిద్దాం…పర్యావరణాన్ని రక్షిద్దాం. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట రమణ

 

విశాఖపట్నం లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎన్ బి యం న్యాయ కళాశాల ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్య లో కళాశాల విద్యార్ధులు బోధనా సిబ్బంది పాల్గొన్నారు సముద్ర తీర ప్రాంతంలో పేరుకు పోయిన ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ వ్యర్ధాలు మరియు మద్యం సీసాలు మొదలగు వ్యర్థాలను తొలగించి సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేసారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట రమణ మాట్లాడుతూ స్థానిక సందర్శకులు మరియు పర్యాటకుల ద్వారా తీర ప్రాంతంలో వ్యర్ధాలు పెరిగి పర్యావరణ క్షీణత కు దారి తీస్తుందని సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాల్సిన భాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు బీచ్ వినియోగ దారులు వారి కార్యకలాపాల అనంతరం చెత్తను ప్లాస్టిక్ వ్యర్ధాలను అక్కడే వదిలేయడం వల్ల సముద్ర కాలుష్యం పెరిగి సముద్ర జీవులకే కాక మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని ఆయన అన్నారు పగిలిన మద్యం సీసాలు  ప్రమాదకరం గా ఉన్నాయని ఇలాంటి సముద్ర తీరప్రాంత శుభ్రత కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం గాంధీ జయంతి రోజున చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, శంకర్ రెడ్డి , రాముడు,మూర్తి, రమేష్, శ్రీనివాస్, లక్ష్మణ్ ,కళ్యాణ్,నంది శివ, ప్రదీప్ తదితర విద్యార్ధులు మరియు బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!