ప్రత్యామ్నాయ విధానాలతోనే రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి,

 

 

ప్రత్యామ్నాయ విధానాలతోనే

రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి,

,రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 10 రంపచోడవరం నియోజకవర్గం ప్రత్యామ్నాయ విధానాలతోనే రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యపడుతుందని సీపీయం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ అన్నారు, సోమవారం రాజవొమ్మంగిలో సిపిఎం సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు అధ్యక్షత జరిగింది ఈ సమావేశానికి హాజరైన సీపీయం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా రంపచోడవరం ప్రాంత ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని పేర్కొన్నారు,ప్రభుత్వాలు ఎన్ని మారిన రంపచోడవరం,చింతూరు, పోలవరం వంటి ఏజెన్సీ ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు, కనీస మౌలిక వసతులు అయిన విద్య,వైద్యం, తాగునీరు,పారిశుద్ధ్యం, విద్యుత్,రహదారులు వంటి సౌకర్యాలు లేక గిరిజన ప్రాంతవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు, ఈ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక అనేకమంది వలసలు పోతున్నారని పేర్కొన్నారు, స్థానిక సమస్యలు అనేకమున్న వాటిపై అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు దృష్టి సారించకపోవడం దారుణమన్నారు, రాజకీయ పార్టీ నేతలు తమ రాజకీయ స్వలాభం కోసం పాకలాడుతున్నారు తప్ప ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం లేదని విమర్శించారు, ఏజెన్సీలో కార్మికులు, ఉపాధికూలీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు, రంపచోడవరం చింతూరు పోలవరం ఐటిడిఎల్ ని కలిపి రంపచోడవరం కేంద్రంగా మరో ఏజెన్సీ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు,ఏజెన్సీ ప్రాంత సమస్యలు పరిష్కారం కోసం,ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం సిపిఎం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు, వరదల్లోనూ కరోనా కష్టకాలంలోనూ ప్రజల వెన్నంటే ఉండి అనేక సేవలు అందించిన ఘనత సిపిఎం కి దక్కుతుందన్నారు, కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు కుమ్మక్కై గిరిజన హక్కులను కాలరాస్తున్నాయని అటవీ హక్కుల చట్టాన్ని సవరించి గిరిజనులను అడవి నుంచి గెంటేసి కుట్ర జరుగుతుందన్నారు,జీవో నెంబర్3 అమలు కోసం, గిరిజనుల హక్కులు, చట్టాలు పటిష్ట అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు,ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారానికై, పోడు భూముల పట్టాల కై ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పనకై,ఆదివాసి స్పెషల్ డిఎస్సికోసం,రైతులకు గిట్టుబాటు ధర కోసం, జీడిమామిడి పిక్కల పరిశ్రమ ఏర్పాటుకై, మౌలిక వసతుల కల్పనకై, రంపచోడవరం నియోజకవర్గం లో అన్ని పీహెచ్ఈల్లో సౌకర్యాలు కల్పన కోసం,స్కీం వర్కర్లకు కనీస వేతనాల కోసం,భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న రంపచోడవరం లో జరిగే బహిరంగ సభకు వేలాదిగా ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి బాబురావు,రామరాజు, ప్రజా సంఘాల నాయకులు కె నూకరాజు, ఎం సింహాచలం,పి ప్రసాద్, దేవి,నాగమణి,నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!