ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు
ముంచంగిపుట్టు (అఖండ భూమి న్యూస్) అక్టోబర్ 24: సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను ప్రభాస్ అభిమానులు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని యువకులు కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభాస్ అభిమానులు పలువురు మాట్లాడుతూ.. ప్రభాస్ అంటే తమకు ఎంతో ఇష్టమని ఆయన నటనతో ప్రజల మనసులు గెలుచుకోవడం తోపాటు డార్లింగ్ ప్రభాస్ గా పిలువబడుతున్నారని యువకులు కొనియాడారు. ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, మురళి, ఉదయ్, కృష్ణ, ఆచార్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.



